Varun Dhawan: డ్రైవర్ మరణాన్ని తట్టుకోలేక బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ ఎమోషనల్| ABP Desam

బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ ఎమోషనల్ గా పెడుతున్న పోస్టులు కలవరపెడుతున్నాయి. తనజీవితంలో తన డ్రైవర్ మనోజ్...ఓ పెద్దన్నలా ఉన్నాడంటూ ఆయన మృతిని తలుచుకుని కుమిలిపోతున్నాడు వరుణ్ ధవన్. రెండు రోజుల క్రితం మనోజ్ అనారోగ్యంతో కన్నుమూయగా..వరుణ్ ధవన్ దగ్గరుండి అంత్యక్రియలను నిర్వహించాడు. ఓ హీరోగా తను ఎదిగే క్రమంలో తనను కంటికి రెప్పలా కాచుకున్న అన్నయ్య ఇకలేరంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన వరుణ్ ధవన్..బీచ్ లో మిస్ యూ మనోజ్ దాదా అంటూ లవ్ సింబల్ వేసి ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వరుణ్ ధవన్ పోస్టులు చూస్తున్న నెటిజన్లు...అతనిది గోల్డెన్ హార్టంటూ కామెంట్స్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola