Yale Researchers Covid Clip: కోవిడ్ ను గుర్తించే క్లిప్ ను తయారు చేసిన యేల్ పరిశోధకులు| ABP Desam
ఓ క్లిప్ పెట్టుకోవటం ద్వారా ఎదుటి వ్యక్తిలో కోవిడ్ ఉందో లేదో పసిగట్టే విధంగా ఓ పరికరాన్ని తయారు చేశారు యేల్ యూనివర్సిటీ పరిశోధకులు. విశ్వవిద్యాలయానికి చెందిన పబ్లిక్ హెల్త్ స్కూల్ పరిశోధక బృందం ఓ గుండ్రటి క్లిప్ ను రూపొందించారు. దాంట్లో పాలిడీమిథైల్ సిలో ఆక్సేన్ తో క్లిప్ ఉపరితలాన్ని రూపొందించి ఉంచారు. వైరస్ సోకిన వ్యక్తి నీటి తుంపర్లు దీని మీద పడినంతనే వైరస్ మ్యాప్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. కలర్ కోడింగ్ ద్వారా రూపొందించారు. పైన ఉండే పాలిమర్ ఫిల్మ్ ను మార్చుకోవటం ద్వారా ఈ క్లిప్ లను పునర్వియోగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.