Vanjangi Hills: ఆకట్టుకుంటున్న విశాఖ మన్యం లోని పాడేరు,వంజంగి హిల్స్.
Continues below advertisement
విశాఖ జిల్లాలో శీతాకాలం అందాల గురించి మాట్లాడితే వెంటనే లంబసింగి అని చెప్తారు.నిజానికి అంతకంటే అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలకు పాడేరు ఏజెన్సీ నెలవైంది.విశాఖ మన్యం లోని పాడేరు,వంజంగి హిల్స్ లో అబ్బుర పరిచే రమణీయ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దానితో భారీ స్థాయిలో పర్యాటకులు పాడేరు ఏజెన్సీ కి పోటెత్తుతున్నారు.ప్రతీరోజూ సూర్యోదయం కాగానే కళ్ళ ముందు సాక్షాత్కరించే మంచు దుప్పటి , చేతికి అందేంత దూరంలో తేలియాడే మబ్బులు, చుట్టుపక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.
Continues below advertisement