వంగవీటి మోహన రంగా వర్దంతి వేడుకల్లో ఆసక్తికర పరిణామాలు...
వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొనటం రాజకీయంగా కలకలం రేపింది.. ఈ నేపథ్యంలో తాజాగా గుడివాడలో వంగవీటి రాధాకృష్ణ, వల్లభనేని వంశీ తో మంత్రి కొడాలి నాని కూడా కలిశారు.. ఒక దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు నేతలు కలిసి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది..ఈ ముగ్గురు కలయికకు వంగవీటి మోహన రంగా వర్దంతి వేడుకలు వేదికగా మారాయి..మరి రాజకీయ పరిణామాలు ఎలాంటి మార్పులు ఉంటాయన్నది సస్పెన్స్ గానే ఉంది.