IND Vs SA : నేటి నుంచే భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలిటెస్టు

దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సవాల్‌కు కోహ్లి సేన సిద్ధమైంది. ఈ రోజు నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ‘బాక్సింగ్‌ డే’ టెస్టు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కెప్టెన్సీ వివాదంతో కొద్దిరోజుల పాటు చర్చనీయాంశంగా మారిన టీమిండియా....సఫారీ గడ్డపై విజయం సాధించి ప్రదర్శనతో వార్తల్లో నిలవాలని భావిస్తోంది. ఓపెనింగ్‌ జోడీ బలం, మిడిలార్డర్‌లో కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌లతో కూడిన బ్యాటింగ్‌ దళం పటిష్టంగా ఉంది.విశేషానుభవం గల రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా ఉండటం జట్టుకు బాగా ఉపకరిస్తుంది. ఎప్పటిలాగే సారథి కోహ్లి ఐదుగురు బౌలర్ల ఫార్ములాతోనే బరిలోకి దిగే అవకాశముంది. సీమ్‌ వికెట్‌ దృష్ట్యా ఈసారి భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పేస్‌ బౌలర్లకే పెద్దపీట వేయనుంది. ఈ నేపథ్యంలో నలుగురు సీమర్లు శార్దుల్‌ ఠాకూర్, షమీ, బుమ్రా, సిరాజ్‌లతో బరిలోకి దిగడం ఖాయం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola