Vangaveeti Ranga : వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వల్లభనేని వంశీ
బెజవాడలో వంగవీటి మోహన రంగా వర్దంతి వేడకల్లో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది.రంగా వర్దంతి సందర్భంగా ఆయన తనయుడు ,మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణతో కలసి వల్లభనేని వంశీ పాల్గొన్నారు. కార్యక్రమంలో రంగా ను కీర్తించారు.రంగా ఆశయాలను సాధిస్తామంటూ మాట్లాడారు. సాధారణ ఎన్నికలకు ముందు వంగవీటి రాధా కృష్ణ వైసీపీ నుంచి టీడీపీలో చేరటం సంచలనం గా మారింది.అయితే ఇటీవల అసెంబ్లీ వేదికగా వంశీ చేసిన కామెంట్స్ పై టీడీపీ సీరియస్ గా ఉంది. ఇదే సమయంలో రంగా వర్దంతి వేడుకల్లో వంశీ పాల్గొనటం చర్చనీయాంశంగా మారింది.