గుడివాడ వేదికగా రంగా వర్దంతి సభ...సంచలన వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాదాకృష్ణ
తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చినగోన్నురు గ్రామంలో నిర్వహించిన వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధా పాల్గొన్నారు. ముగ్గురు నేతలు కలిసి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వంగవీటి రాధా ఉద్వేగ భరితంగా ప్రసంగించారు .తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని, నన్ను ఏదో చేద్దాం అనుకునే వారిని చూసి భయపడనని, ప్రజల మధ్యే తిరుగుతానని ఆయన స్పష్టం చేశారు. వంగవీటి రాధా లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.