TRS BJP Fight : నిజామాబాద్ గన్నారంలో భాజపా, తెరాస నాయకుల మధ్య తోపులాట
నిజామాబాద్ జిల్లా గన్నారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెరాస నాయకులు వచ్చి పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని ప్రారంభించినా... మళ్లీ వాటిని ప్రారంభించేందుకు వచ్చిన ఎంపీ అర్వింద్. తాము ఓపెనింగ్ చేశాక మరోసారి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎంపీ రాకపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్వింద్ వాహనాన్ని తెరాస నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగి భాజపా, తెరాస నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి.