Vangaveeti Radha: వంగవీటి రాధాకృష్ణ హత్యకు కుట్ర ఆరోపణలపై దూకుడు పెంచిన వైసీపీ
Continues below advertisement
వంగవీటి రాధాకృష్ణ తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రల్లో హాట్ టాపిక్ గా మారింది.స్వయంగా సీఎం జగన్ స్పందించిన గన్ మెన్ లను కేటాయించాలని ఆదేశించారు.అయితే గన్ మెన్ లను రాధా తిరస్కరించారు. చంద్రబాబు రాధా ఇంటికి వెళ్ళి పరామర్శించి ప్రభుత్వం పై విమర్శలు చేశారు.అయితే రాధా వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవటానికి టీడీపీ ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.ఆధారాలు లేకుండా హత్యకు కుట్ర చేశారంటూ మాట్లాడటం ఏంటని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు చేశారు.ఆధారాలు ఇస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాధా వ్యవహారంపై సమగ్రవిశ్లేషణ.
Continues below advertisement