Vangaveeti :రెక్కి చేసినట్లుగా ఆధారాలున్నా పోలీసులు ఎందుకు స్పందించటం లేదన్న చంద్రబాబు
రాధా పై రెక్కీ ఘటన పై ప్రజలు నమ్మే విధంగా పోలీసుల విచారణ ఉండాలి,ఘటన విషయం బయటకు వచ్చి ఇప్పటికే వారం అవుతుంది... అయినా ఏమీ తేల్చలేదు.నేను లేఖ కూడా డీజీపీ కి లేఖ రాశాను...దాని ఆధారం గా విచారణ చెయ్యలేరా!..ఇలాంటి ఘటనల్లో కాలయాపన చెయ్యడం మంచిది కాదు.తనకు ప్రాణ హాని ఉందని స్వయంగా వంగవీటి రాధా చెప్పారు.ఇంటి వద్ద కారు తిరిగినట్లు ఆధారాలు వచ్చిన తరువాత కూడా ఎందుకు దోషులను పట్టుకోలేదు.అయినా కారు ఎవరిదో ఎందుకు పట్టుకోలేకపోయారు.దోషులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.