Today Episode: హిమను కూడా దత్తత తీసేసుకుంటా... చిన్ని మాటలకు అయోమయంలో పడిన రమణమ్మ
రుద్రరాణి గుండాలు లారీలో వెళ్లి శ్రీవల్లి, కోటేష్ లను చంపేస్తారు. మోనిత బస్తీ ఖాళీ చేయలంటూ వారణాసి వార్నింగ్ ఇస్తాడు. అది తన ఇళ్లని... తనకు నచ్చినప్పుడు వచ్చి వెళ్తుంటానని మోనిత చెప్తుంది. శ్రీవల్లి గురించి తెలుసుకున్న కార్తీక్... రుద్రరాణి దగ్గరకు వెళ్లి తాను చేసింది అన్యాయం అంటూ వాదిస్తాడు. ఒప్పందం ప్రకారమే బాబును తెచ్చుకుంటే పోలీస్ కంప్లయింట్ ఇచ్చారని.. అందుకు తనకు కోపం వచ్చిందని రుద్రరాణి చెబుతుంది. కార్తీక్ తీసుకున్న అప్పు చెల్లించకపోతే హిమను దత్తత తీసుకుంటానని బెదిరిస్తున్నప్పుడు ఇవాళ్టి కార్తీక దీపం ఎపిసోడ్ అయిపోతుంది.