AP Governor New Year Wishes : నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌కు వేదాశీర్వ‌చ‌నం

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గవర్నర్ Biswabhushan Harichandan దంపతులను ముఖ్య ఎన్నికల కమీషనర్ విజయానంద్ తన సిబ్బందితో వచ్చి శుభాకాంక్షలు అందించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. DGP Gautam Sawang , నగర పోలీసు కమీషనర్ Kanthi Rana Tata, పోలీసు ఉన్నతాధికారులు బిశ్వభూషణ్ హరించదన్, సుప్రవ హరిచందన్ దంపతులకు నూతన సంవత్సర శుభవేళ పుప్ఫగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర ఆగమన శుభవేళ రాజ్ భవన్ రూపొందించిన 2022 సంవత్సర క్యాలెండర్ ను రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారుల సమక్షంలో గవర్నర్ ఆవిష్కరించారు. దేవదాయ శాఖ కార్యదర్శి వాణీ మోహన్ నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్ధానం పండితులు మంత్రోచ్ఛరణతో గవర్నర్ దంపతులను అశీర్వదించి శ్రీవారి ప్రసాదంను అందించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం ఛైర్మన్ ఫైల సోమినాయిడు, ఇఓ భ్రమరాంబ తదితరులు గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. దేవస్ధానం పండితులు కనకదుర్గమ్మ అమ్మవారి తరుపున గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola