Vanama Raghava: ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్
ద్రాద్రి కొత్తగూడెంలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల కేసులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చారు. రాఘవకు జిల్లా రెండవ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకముందు... రాఘవను కోర్టుకు తీసుకెళ్తుండగా దారిలో భాజపా నాయకులు నిరసన చేపట్టారు. రాఘవను కోర్టుకు తీసుకెళ్లి సమయం వృథా చేయొద్దని, ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడు కాకపోయి ఉంటే ఈపాటికే ఆ పని చేసేవారు కదా అన్నారు. సామాన్యులకు ఓ న్యాయం, తెరాస వాళ్లకు ఓ న్యాయమా అని నిలదీశారు.