Uttarakhand Labour in Telangana: ఉత్సాహంగా నాట్లు వేస్తున్న ఉత్తరాఖండ్ కూలీలు | ABP Desam
హనుమకొండ జిల్లా కమలపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆడపడుచులు వరినాట్లు వేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొంతకాలంగా రైతులకు కూలీల కొరత ఏర్పడటంతో నాట్లు ఆలస్యమయ్యాయి. అదే సమయంలో ఉత్తరాఖండ్ నుంచి వలస వచ్చినవారితో నాట్లు వేయడం ప్రారంభించారు. తమ రాష్ట్రంలో ఏ పనులూ లేక ఇక్కడికి వచ్చామని, ఇక్కడ గిట్టుబాటు అవుతోందని కూలీలు చెబుతున్నారు.