UP Election 2022 : ఎన్నికల ముందు వేడెక్కుతున్న యూపీ రాజకీయం..!

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ భాజపా నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. దీంతో సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఐపీ సింగ్ భాజపాకు ఓ గిఫ్ట్ పంపించారు. ఏం గిఫ్ట్ తెలుసా? తాళం కప్ప. అవును.. మార్చి 10న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భాజపా కార్యాలయానికి తాళం వేయడానికి ఈ లాక్‌ను పంపించారట. లఖ్‌నవూలోని హజ్రాత్ గంజ్, విధాన సభ 7 అనే చిరునామాకు ఈ తాళం కప్ప షిప్పింగ్ అయిన మెసేజ్‌ను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్ జీ, జయంత్ చౌదరీ జీ, రాజ్‌మాతా కృష్ణ పలేట్ జీ, సంయజ్ చౌహాన్ జీ.. తాజాగా స్వామి ప్రసాద్ మౌర్యా జీ.. ఇలా అందరూ భాజపా నుంచి సమాజ్‌వాదీ పార్టీకి క్యూ కడుతున్నారు. అందుకే భాజపా కార్యాలయానికి తాళం కప్ప వేసేందుకు స్వతంత్ర దేవ్ సింగ్ జీకి ఇది బహుమతిగా పంపుతున్నానని తాళం బుకింగ్ ఆర్డర్ ను ట్వీట్ చేశారు ఐపీసింగ్. మార్చి 10 (యూపీ ఎన్నికల ఫలితాలు)న దీంతో కార్యాలయానికి తాళం వేసి.. ఇంటికి వెళ్లిపోండి. ఇది అల కాదు.. సమాజ్‌వాదీ పార్టీ తుపానంటూ పవర్ పంచ్ లు విసిరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola