Undavalli Arun: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై తనదైన శైలిలో ఉండవల్లిలో విమర్శలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుష్ట, అవినీతి పరిపాలన అంతమొందాలంటే 50 శాతం మంది ప్రజలు పుస్తకాలు చదవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పుస్తక పఠనంతోనే ప్రశ్నించేతత్వం అలవడుతుందని అప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఒకొక్క రంగం ఒకొక్కరే మాట్లాడాలి అనే పరిధి నుంచి బయటకు వచ్చి అన్ని విషయాలపై అందరూ మాట్లాడే స్థితికి చేరాలంటే పుస్తక పఠనం ఒకటే మార్గమని సూచించారు. పుస్తక ప్రియుల పాదయాత్ర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.