UAPA Cases: నమోదవుతున్న రాజద్రోహం కేసుల్లో ఎన్ని నిరూపితమవుతున్నాయి..?
ఒక్క విమర్శ ....ఒకే ఒక్క విమర్శ...ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే చాలు రాజద్రోహం అయిపోతోందా. లోపాలను ఎత్తి చూపటమే ఆలస్యం....అవతలి వ్యక్తిపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందా...ఈ విమర్శలన్నీ ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్నాయి. కారణం ప్రతీ ఏడాదిలానే ఈ సారి జాబితా విడుదలైంది. ఎన్ని కేసులు రాజద్రోహం కింద నమోదవుతున్నాయో అందులో ఒకటో రెండో శాతం మందిపై నేర నిరూపణ అవుతోంది. మరి మిగతావారి సంగతేంటి..? ఇది కాసేపు పక్కన పెడదాం.