Tushar Gandhi on Savarkar|మహాత్మా గాంధీ హత్యలో సావర్కర్ పాత్రపై సంచలన ఆరోపణలు|ABP Desam
ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో సావర్కర్ మీద మాటల తుటాలు పేలుతున్నాయి. బ్రిటీషర్లను క్షమాపణ కోరుతూ సావర్కర్ సంతకం చేశారని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్లు వస్తున్నాయి. అలాగే కొందరు మద్దతు తెలుపుతున్నారు. ఆ జాబితాలో ముందున్నారు.. మహాత్మా గాంధీ ముని మనువడు తుషార్ గాంధీ. మహాత్మాగాంధీని చంపేందుకు నాథూరాం గాడ్సే కు తుపాకీని సావర్కర్ సమకూర్చారని ఆరోపించారు.