Tulasireddy Slams AP Govt: ఏపీ ప్రభుత్వ రైతు విధానాలపై తీవ్ర విమర్శలు
ఏపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. రైతుల పండగ అయిన సంక్రాంతి సమయాన వారి ముఖాల్లో సంతోషం లేకుండా ప్రభుత్వం చేసిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశా కేంద్రాలయ్యాయన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలో దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. రైతుల చేతులకు సంకెళ్ళు వేసిన రైతు దుష్మన్ ప్రభుత్వం... జగన్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.