Tribal Students: విజయనగరం జిల్లాలో దారుణం....పోలీసునని చెప్పి గిరిజన బాలికలపై లైంగికదాడి

పోలీసునంటూ బెదిరించి ఓ వ్యక్తి...ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారం చేసిన సంఘటన విజయగనం జిల్లా కురుపాంలో జరిగింది. దీనిపై ఇద్దరు బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కురుపాం పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ సెల్రబేషన్స్ కోసం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు వద్దకు వెళ్లి తాను పోలీసునంటూ వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. వారి ఫోటోలను, వీడియోలను తన సెల్ ఫోన్ తో చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. బాలికలను సమీపంలోని పామాయిల్‌తోటకు తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరిపై లైంగిక దాడికి యత్నించాడని... ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానంటూ భయపెట్టాడని పోలీసులు తెలిపారు.నిందితుడిపై 13 కేసులున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం రాగానే ఆ రాత్రే నిందితుడిని అరెస్ట్ చేశాం. కేసు దర్యాప్తు పూర్తి చేసి...సెంటిఫిక్ ఎవిడెన్స్ సహాయంతో అతడికి శిక్షపడేలా చూస్తాం. పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్లు 376, 506 ప్రకారం కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola