Toddler Shopping: మొబైల్ నుంచి వాల్ మార్ట్ ఆన్ లైన్ ఆర్డర్ పెట్టేసిన రెండేళ్ల పిల్లాడు| ABP Desam

Continues below advertisement

చిన్నపిల్లలకు మొబైల్స్ ఇచ్చి వదిలేయటం ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటనను అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. న్యూజెర్సీలో నివాసం ఉంటున్న ఎన్‌ఆర్ఐ మధుకుమార్ కి రెండేళ్ల కుమారుడు అయాన్ష్ ఉన్నాడు. గేమ్స్ ఆడుకోవటం కోసం చిన్నారికి తల్లితండ్రులు ఫోన్ ఇవ్వగా పిల్లాడు తెలియకుండా వాల్ మార్ట్ లో ఆన్ లైన్ ఆర్డర్ పెట్టడం అక్కడ సంచలనంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1700 అమెరికన్ డాలర్లు అంటే దాదాపు లక్షా యాభై వేల రూపాయల ఫర్నిచర్ ఇంటికి రావటంతో తల్లితండ్రులు అవాక్కయ్యారు. వాల్ మార్ట్ యాప్ చెక్ చేసుకోగా ఆర్డర్ ఉండటంతో....పిల్లాడు చేసిన పని వెలుగుచూసింది. వాల్ మార్ట్ కి రిక్వెస్ట్ పెట్టుకోగా....రిటర్న్ పాలసీకి అంగీకరించినా...ఈ ఘటనను ప్రముఖంగా ప్రస్తావించాయి అంతర్జాతీయ పత్రికలు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram