కార్మికుల సంక్షేమ నిధులను ముఖ్యమంత్రి జగన్ దారి మళ్లించారన్న టిఎన్ టియూసి
కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన 750 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దారి మళ్లించారని టిఎన్ టియూసి రాష్ట్ర అధ్యక్షుడు రఘురామ రాజు కర్నూలులో ఆరోపించారు. కర్నూలులో నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం, హిందూపురం పార్లమెంటు టీన్ టియూసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా టీన్ టీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసి ఫ్యాక్టరీ భూములను సియం జగన్ కొట్టేయాలని చూస్తున్నారని విమర్శలు చేశారు.