Title- Adivi Sesh: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో అడివి శేష్
Continues below advertisement
అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ తో పాటు శోభితా ధూళిపాళ, రేవతి, ప్రకాష్ రాజ్ ప్రధానపాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆలస్యమవుతోంది. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా అడివి శేష్... ఉన్నికృష్ణన్ కుటుంబసభ్యులతో గడిపారు. 13 ఏళ్ల క్రితం ఇదే రోజున మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు అశోక చక్ర వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు వైరలవుతున్నాయి.
Continues below advertisement