Tirupati Kabaddi Fest: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు భారీ స్వాగతం

తిరుపతి ఇందిరా మైదానం జాతీయ క్రీడా కబడ్డీ పండుగ వాతావరణం సంతరించుకుంది.. మైదానానికి విచ్చేసిన ప్రముఖులతో పాటు పురప్రజలు పెద్ద ఎత్తున హాజరై బాణాసంచా కార్యక్రమాన్ని ఆహ్లాదకర వాతావరణంలో తిలకించి ఉల్లాసంగా కార్యక్రమాన్ని ఆస్వాదించారు. బాణాసంచా ప్రదర్శన మిరమిట్లు గొలిపేలా సాగింది.. ఈ ప్రదర్శన నగర ప్రజలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి.. ప్రదర్శనలో ప్రధానముగా ఈత చెట్టు,నాగుపాము,సూర్య చక్రం,రన్నింగ్ వీల్ ప్రదర్శన పురప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. వీటితో పాటు తారాజువ్వలు ఆకాశంలో నాట్య ప్రదర్శనతో కనిపించాయి.. వివిధ రంగుల తో కూడిన షాట్స్ నగర ప్రజలను వీనుల విందు చేసాయి. తార జువ్వలు ఆకాశము వైపు దూసుకెళ్ళడంతో ఇందిరా మైదానంలో ప్రదర్శన ప్రారంభమైనది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola