Tirupati Kabaddi: కబడ్డీ కూత పెట్టి ఉత్సాహ పరిచిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
జనవరి 5 నుంచి 9 వరకు తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిపోటీలు కావటంతో....కబడ్డీ పోటీలకు ప్రచారం నిర్వహించే బాధ్యతలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్, తిరుపతి మేయర్ తో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి....జాతీయ స్థాయి పోటీలకు ప్రచారం నిర్వహించారు.