Tirumala Vykunta Darshans: తిరుమలలో కన్నుల పండువగా ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి దర్శనాలు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని గత ఏడాది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం భక్తులకు కలిగింది. అయితే కరోనా నిబంధనల కారణంగా ముందస్తు దర్శన టికెట్లు ఉన్న వ్యక్తులను మాత్రమే దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను భక్తులు పొందారు. అలాగే తిరుపతిలో స్థానికుల కోసం 50 వేలు కరెంట్ బుకింగ్ ఉచిత దర్శనం టికెట్లు టీటీడీ కేటాయించింది. తెల్లవారుజామున రెండు గంటల నుంచే ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ముందస్తు టికెట్లు ఉన్న ఇతర భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు మాడ వీధుల్లో విహరించారు. రేపు ద్వాదశి సందర్భంగా పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించనున్నారు.