Tirumala VIPs : శ్రీవారిని దర్మించుకున్న కేంద్ర సహాయక మంత్రి మురుగన్
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర సహాయక మంత్రి ఏల్.మురుగన్, బిజేపి నేత భానుప్రకాష్ రెడ్డిలు స్వామివారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా,ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.