Tirumala Swarna ratham: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వర్ణరథోత్సవం

Continues below advertisement

తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నేడు స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని తిరుమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. టీటీడీ మ‌హిళా ఉద్యోగులు ర‌థాన్ని లాగారు. ఆల‌య మాడ వీధుల్లో స్వ‌ర్ణ‌ర‌థంపై విహ‌రించిన శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామి వారిని గ్యాల‌రీల్లో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా గోవింద‌ నామ‌స్మ‌ర‌ణ‌తో మాడ వీధులు మారుమోగాయి.. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో స్వర్ణరధంను లాగే టిటిడి‌ మహిళా ఉద్యోగులకు ముందస్తుగా కోవిడ్ పరిక్షలు నిర్వహించన అనంతరం స్వర్ణరధంను లాగేందుకు మహిళా ఉద్యోగులను టీటీడీ‌ అనుమతించింది. వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్క‌రిణిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవంను టీటీడీ ఏకాంతంగా నిర్వహించనుంది..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram