Tirumala Srivari Temple:గోదాదేవి పరిణయాన్ని పురస్కరించుకునితిరుమల శ్రీవారి మూలవిరాట్ కుగోదాదేవిమాలలు
Continues below advertisement
శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని శ్రీవారి మూలవిరాట్‌కు ఇవాళ ఉదయం గోదాదేవి మాలలను అలంకరించారు.. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలాలు తిరుపతి నుండి తిరుమల పెద జీయర్ వారి మఠానికి ఆదివారం ఉదయం చేరుకున్నాయి.. అనంతరం పెద్ద జీయర్ మఠం నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్టుకు అలంకరించారు
Continues below advertisement