Tirumala Rathasapthami: తిరుమలలో రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించిన టిటిడి.
Tirumalaలో సూర్యప్రభ వాహనం పై ఘనంగా రథసప్తమి వేడుకలు జరిగాయి.తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీవారు.సూర్య జయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. Ratha Sapthami వేడుకల్లో ప్రధమ వాహనంగా సూర్య నారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు.