Tirumala Ghat Road: నేటి నుంచి అందుబాటులోకి రెండో ఘాట్ రోడ్డు
డిసెంబర్ లో భారీ వర్షాలకు దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తయ్యాయి. నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పనులను పరిశీలించిన ఆయన.... గత నెలలో కొండచరియలు విరిగిపడి 3 ప్రాంతాల్లో రోడ్డు దెబ్బతిందని వివరించారు.