Tirumala Devotees Dharna: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తుల ఆందోళన.మహాద్వారం వద్ద బైఠాయింపు
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. వైకుంఠ ఏకాదశి దర్శనం రోజున టీటీడీ వీఐపీల సేవలోనే మునిగిపోయిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి ఆలయ మహాద్వారం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 1గంట నుంచి చిన్నపిల్లలతో కంపార్ట్ మెంట్ లోనే ఉండిపోయామని రాత్రి 8గంటలవుతున్నా దర్శనం కల్పించలేదని మండిపడ్డారు భక్తులు. వీఐపీలకు దర్శనం కల్పించేందుకు ప్రతీ ఐదు నిమిషాలకు లైన్ నిలిపివేస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.