మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామంలో మత్తు బిళ్ళలు ఇచ్చి చోరీ
మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామంలో మత్తు బిళ్ళలు ఇచ్చి ఒక మహిళ ఇంట్లో బంగారం చోరీ అయిన ఘటన వెలుగులోకొచ్చింది.ఎర్రబాలెం గ్రామంలో మెడికల్ ఏజెంట్ అని చెప్పి ఒక వ్యక్తి మహిళ ఇంటి వద్దకు వచ్చి నాకు అడ్రస్ తెలియట్లేదు ఆకలిగా ఉంది భోజనం పెట్టమని అడిగాడు. అనంతరం మీకు ఒంట్లో బాగోక పోతే నేను టాబ్లెట్లు ఇస్తాను,నేను మెడికల్ ఏజెంట్ అని చెప్పి ఆమెకు మత్తు టాబ్లెట్ ఇచ్చి, ఆమె వద్ద ఉన్న మెడలోని బంగారపు తాడు ఉంగరం మరియు చెవి రింగులను తీసుకొని పరారయ్యాడు.