Telangana RTC: తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ బస్సులపై ప్రత్యేక ఛార్జి లేదు.. ఏపీలో మాత్రం బాదుడే
సంక్రాంతి పండక్కి ప్రతి ఒక్కరూ ఊళ్లకు వెళ్లడం సహజం. అయితే ఇదే అదనుగా ఏపీఎస్ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు.. ఛార్జీలను అమాంతం పెంచేశారు. కానీ తెలంగాణ ఆర్టీసీ మాత్రం తాము ఎలాంటి బస్సు ఛార్జీలు పెంచట్లేదని.. సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన అదనపు బస్సుల్లో 90 శాతం సీట్లు బుక్ అయిపోయాయని .. తమకున్న బ్రాండ్ నమ్మకం అలాంటిదని ఏపీఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సంక్రాంతి సీజన్ లో జరిగే ప్రయాణాల వల్ల ఎవరికి డిమాండ్ పెరుగుతుందనేది ఆసక్తిగా మారనుంది.