Telanagana: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ వివరాలు వెల్లడించిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసు నమోదైంది. రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 8కి చేరుకుంది. పరిస్థితి అదుపులో వుంది అన్నారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా వుంది. ఇప్పటివరకు ఎలాంటి తీవ్రమైన వ్యాధి లక్షణాలు లేవన్నారు. కొత్త వేరియంట్ వలన ప్రాణాపాయం ఉండదు.