Telangana Governor @Tirumala: శ్రీవారిని దర్శించుకున్న తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ తెల్లవారుజామున వీఐపీ విరామ సమయంలో కుటుంబీకులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామివారి శేషవస్త్రాలు అందించారు. ఆలయం బయట మాట్లాడిన తమిళిసై.... ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.