Fire Accident: సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం
ABP Desam
Updated at:
16 Jan 2022 01:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో క్లబ్ లో మంటలు చెలరేగాయి. క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న 10 మంది అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 20 కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా నిన్న క్లబ్ తెరవకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.