Teacher Sacrifies Her Life:బదిలీతో మానసిక క్షోభ చెంది ఉపాధ్యాయురాలు ఆత్మహత్య...?

భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి (35) ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు గత కొద్ది రోజులుగా మానసికంగా బాధపడుతున్నట్లు సమాచారం. మండలం లోని రహత్ నగర్ లో టీచర్ గా పని చేస్తున్న సరస్వతి కి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ద్వారా కామారెడ్డి జిల్లా కు బదిలీ అయ్యింది. బదిలీ కావడంతో జాయినింగ్ రిపోర్ట్ కూడ అందించారు. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకున్నారు. కుటుంబ సభ్యులు చూసి ఆర్మూర్ లోని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త బేతల భూమేష్ ఉపాధి నిమిత్తం ఖతర్ వెళ్ళారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఉపాధ్యాయురాలు మృతికి మానసిక కారణమా, బదిలీ నా విచారణ లో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola