PeddaBompallI : కర్నూలు జిల్లాలో పెద్దబొంపల్లిలో ఇరువర్గాల మధ్య కొట్లాట| ABP Desam
కర్నూలు జిల్లా కోసిగి మండలం పెద్ద బొంపల్లిలో అంజనేయస్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన టిడిపి ఇంచార్జీ తిక్కరెడ్డిని వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు అడ్డుకోవటంతో గ్రామంలో ఘర్షణ చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో సుమారు ఆరుగురికి తలలపై తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స ఆసుపత్రికి తరలించారు. మా గ్రామానికి టీడీపీ ఇంచార్జీ తిక్కరెడ్డి రాకూడదని వైసీపీ వర్గీయులు అడ్డుకొని కర్రలతో దాడులు పాల్పడ్డారు. పెద్ద బొంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో... గ్రామంలో పోలీసు బలగాలను మొహరించారు.