Vallabhaneni Vamsi:చంద్రబాబు లక్ష్యంగా వల్లభనేని వంశీ ఘాటైన ట్వీట్లు

టీడీపీ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. పరిటాల సునీత వ్యాఖ్యలతో మొదలైన యుద్ధం వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకునేంతవరకూ వెళ్లింది. తెలుగుదేశం చేసిన విమర్శలకు స్పందిస్తూ చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని వంశీ ఘాటైన ట్వీట్లు చేశారు. తల్లీపిల్లల మధ్య కూడా తగాదాలు పెట్టగల నేర్పరి చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. పరిటాల సునీత వ్యాఖ్యలపై స్పందిస్తూ తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని లోకేశ్ ను గెలిపించుకోండని సవాల్ విసిరారు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో కృష్ణా జిల్లా మహిళలను కించపర్చేలా వంశీ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola