TDP Truth Finding Committe: ఏలూరు రేంజ్ డీఐజీకార్యాలయంలో టీడీపీ నిజనిర్థారణ కమిటీఫిర్యాదు
గుడివాడలో మంత్రి కొడాలినాని కన్వెన్షన్ లో క్యాసినోవా నిర్వహించారంటూ టీడీపీ నిజనిర్థారణ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంక్రాంతికి క్యానినోవా నిర్వహించారంటూ వచ్చిన ఆరోపణలపై టీడీపీ నిజనిర్థారణ కమిటీ...ఆ బృందం నిన్న గుడివాడలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు టీడీపీ కమిటీనీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నేతలు....జరిగిన అంశాలపై డీఐజీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.