TDP Leaders Prayers : 101 కొబ్బరికాయలు కొట్టి టీడీపీ నాయకుల మొక్కులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ తిరుమల అఖిలాండం వద్ద పార్టీ నాయకులు మొక్కులు చెల్లించుకున్నారు. 101 కొబ్బరికాయలు కొట్టారు. వారిద్దరూ నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు.