TDP Committee : ఎర్రమట్టి తరలింపు అక్రమాలపై టీడీపీ నిజనిర్థారణ కమిటీ సభ్యుల హౌస్ అరెస్ట్
అధికార పార్టీ కి చెందిన కొందరు ఎర్రమట్టి ని అమ్ముకుని అవినీతి కి పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు రాష్ట్ర టీడీపీ పార్టీ ఈ రోజు నిజ నిర్దారణ కోసం పత్తికొండ కు వస్తుండగా పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ లు చేశారు. పత్తికొండ టీడీపీ ఇంచార్జి కేఈ శ్యామ్ బాబు ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు పత్తికొండ పోలీసులు. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిరెడ్డి ని కర్నూల్ లో హౌస్ అరెస్ట్ చెయ్యగా....అనంతపురం కి చెందిన నిమ్మల కిష్టప్ప ని అనంతపురం లో ఆయన ఇంట్లో నే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.టీడీపీ కి చెందిన బిటెక్ రవి బెంగుళూరు నుండి పత్తికొండ కు వస్తుండగా అరెస్ట్ చేశారు. ఎర్రమట్టి తరలింపు లో ఎలాంటి అవినీతి జరగనప్పుడు ఎందుకు హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు పోలీసుల పై మండి పడ్డారు పత్తికొండ టీడీపీ ఇంచార్జి కేఈ శ్యామ్ బాబు.