KTR Open Offer To Standup Comedians : బెంగళూరులో పరిస్థితిని సెటైరిక్‌గా చెప్పిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ స్టాండప్ కమెడియన్లు కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీలకు ఆహ్వానం పలికారు. హైదరాబాద్‌లో షోలు క్యాన్సిల్ చేయబోమన్నారు. ఈ విషయం నేషనల్ హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే..? " బెంగళూరు మెట్రోలిపాలిటన్ నగరమని చెప్పుకుంటారు... అయితే అక్కడ కామెడీని మరీ ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? నాకు అర్థం కావడంలేదు ?" తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామెడీని సీరియస్‌గా తీసుకోవడం అనే పదం సెటైరిక్‌గా ఉండటమే కాదు.. ఆయన వ్యాఖ్యానించినది కూడా ఇద్దరు ప్రముఖ స్టాండప్ కమెడియన్లకు ఎదురైన అనుభవాల గురించి. ఆ ఇద్దరి కామెడి పొలిటికల్‌గా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. అందుకే కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola