Tatamsetti Nagendra: ఇవి చదివితే చాలు రాష్ట్రంలో సమస్యలన్నీ పోతాయి
రాష్ట్రంలో ఉన్న సమస్యలు పోవాలంటే మూడు వాక్యాలు చదివితే చాలన్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర. మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తాతంశెట్టి నాగేంద్ర..పవన్ కల్యాణ్ అనే నేను అంటూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.