Tamil Nadu Goods Train Fire Incident | డీజిల్‌ తరలిస్తున్న రైలులో మంటలు

చెన్నై పోర్టు నుంచి 52 వ్యాగన్లలో బెంగళూరుకు డీజిల్ ను తరలిస్తుండగా గూడ్స్ ట్రైన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక వ్యాగన్‌లో చెలరేగిన మంటలు వేగంగా ఇతర వ్యాగన్లకు వ్యాపించాయి. దాంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలులో మంటలు చలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.  అనంతరం మంటలను అదుపు చేశారు. భారీ ఎత్తున అగ్ని చెలరేగుతుండడం వల్ల వాటిని అదుపు చేయడం కష్టతరంగా మారింది. భారీగా పొగలు వ్యాపిస్తున్నందున సమీప ప్రాంత ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. పలు లోకల్‌ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా రద్దు చేశారు. అలాగే ముందస్తు జాగ్రత్తగా అక్కడే ఉన్న ఇళ్లల్లోని గ్యాస్​ సిలిండర్​లను వేరే చోటకు తరలించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola