Ahmedabad plane crash Reasons Report | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బయటకొచ్చిన ప్రాథమిక నివేదిక | ABP Desam
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 270 మందికి పైగా మరణించిన ఘటనలో అసలు వాస్తవాలు ఏంటో బయటకు వచ్చాయి. విమానం ప్రయాణించే సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టిందని...కాదు విమానాలు ఉగ్రవాదులు టార్గెట్ చేసి పేల్చేశారని..ఇలా ప్రచారంలో ఉన్న అనేక కథలను కొట్టి పారేసింది ఎయిర్ ఇండియా. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB విడుదల చేసిన ప్రాథమిక నివేదక ప్రకారం విమానం కూలిపోవటానికి ప్రధాన కారణం రెండు ఇంజిన్లలోకి ఇంధన సరఫరా నిలిచిపోవటమే కారణంగా తేలింది. ఇంధన సరఫరా ను నియంత్రించే స్విచ్ఛులు ఆఫ్ అయిపోగా వాటిని తిరిగి రికవరీ చేసేందుకు పైలెట్స్ ప్రయత్నించారు. ఒకటి రికవరీ కాగా మరొకటి సాధ్యపడకపోవటంతో పైలైట్లు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ATC చెప్పేలోపే విమానం నేల కూలిపోయింది. విమానంలో ఉన్న ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన వాళ్లంతా దుర్మరణం పాలయ్యారు. మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ ను విమానం ఢీకొట్టడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. మొత్తం ఈ ఘటనలో 270మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తేల్చింది.