Tagged Pigeon : చిత్తూరు జిల్లాలో ట్యాగ్ ఉన్న పావురం కలకలం
తెలుగురాష్ట్రాల్లో మళ్లీ పావురం కలకలం రేగింది. ఇటీవల ఖమ్మం జిల్లాలో ట్యాగు ఉన్న పావురాన్ని గుర్తించగా... తాజాగా చిత్తూరు జిల్లా పాకాల మండలం వెంకటాపురంలో పావురం కాలికి ఉన్న సిల్వర్ ట్యాగ్ చూసి స్థానికులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్యాగ్ ను పరిశీలించిన పాకాల ఎస్సై వంశీధర్... ఆ పావురం ఎక్కడిదనే విషయాలు వెల్లడించారు.