Sushanth Singh Case:సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో వాస్తవాలు బయటపెట్టాలంటూ అభిమానుల ఆవేదన
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మరోసారి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడన్న వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ప్రారంభించి నెలలు గడుస్తున్నా...ఇప్పటికే సుశాంత్ కు న్యాయం జరగటం లేదంటూ అభిమానులు మండిపడుతున్నారు. సుశాంత్ కేసులో అసలు దోషులను సీబీఐ బయటపెట్టాలని, కేసులో నిజాన్ని అణిచివేయకుండా వెలుగులోకి తీసుకురావాలంటూ ఒకే రోజు యాభై వేలకు పైగా అభిమానులు ట్వీట్లు చేశారు. #CBI Expose SSR Killers Name, #SSR Truth Being Suppressed హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లోకి తీసుకురావటం ద్వారా తమ డిమాండ్లను వినిపిస్తున్నారు