Sugarcane Farmers : విజయనగరం జిల్లా బొబ్బిలి ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ ముట్టడి విఫలం
విజయనగరం జిల్లా బొబ్బిలి సీతానగరం ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రైతులు ఆందోళన చేశారు.బకాయిలు చెల్లించాలని కోరుతూ చక్కెర కర్మాగారాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. వారికి మద్దతుగా వచ్చిన వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌లు చేశారు. కర్మాగారం ముట్టడికి అనుమతులు లేవంటూ చర్యలు చేపట్టారు. కర్మాగారం ముట్టడికి వెళ్లిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించారు.